Prayers

రాత్రి కాల జపము

సర్వేశ్వరుడు మనకు చేసిన యుపకారములన్నీ తలంచుము
ఓ: సర్వేశ్వరా, దయాసముద్రుడవై యుండేడు స్వామి ఏలినవారు నన్ను సృష్టించి నాకు ఆత్మ శరీరములకు కావలసిన వస్తువులన్నియు ఇచ్చితీరే:

అం: స్వామీ మీకు స్తోత్రము కలుగును గాక

ఓ: ఏలినవారా, నేను ఎన్నో పాపములను చేసినను నన్ను తల్లిదండ్రులవలె కాపాడితేరే.
అం: స్వామీ మీకు స్తోత్రము కలుగును గాక

ఓ: ఏలినవారా, మీరు పరలోకము నుండి భూలోకమునకు వచ్చి నా కొరకుగాను అనేక పాటులను అనుభవించి స్లీవమీద కఠినమైన మరణమును పొందితీరే.
అం: స్వామీ మీకు స్తోత్రము కలుగును గాక

ఓ: ఏలినవారా , నన్ను శ్రీసభలో జేర్చి నా పాపములను పరిహరించితిరే.
అం: స్వామీ మీకు స్తోత్రము కలుగును గాక

ఓ: స్వామి! నేను చేసిన పాపముల నిమిత్తము నన్ను నరకములో త్రోయక పాపసంకీర్తన ముఖంతరముగా నా పాపములన్నింటినీ మన్నించి సత్ప్రసాదమనెడు దివ్య భోజనము నాకు నియ్య నవధరించితిరే
అం: స్వామీ మీకు స్తోత్రము కలుగును గాక

ఆత్మశోధన పవిత్రాత్మయైన సర్వేశ్వరా, దేవరవారు మాయందు వేంచేయు అనుగ్రహించండి. పరలోకమునుండి మీ దివ్య ప్రకాశ కిరణములు మాపై వ్యాపింపచేయండి. నేను ఈ దినము చేసిన పాపములన్ని జ్ఞాపకమునకు తెచ్చుకొని వాని కొరకు మనస్థాపం పద మీ సహాయము నియ్య అనుగ్రహించండి

1. లేచితోడనే జపము చెప్పితివా ?
2. దేవునియందు భక్తి ఉంచక పిశాచి యొక్క మంత్రం తంత్రములు చేయించుకొంటివా?
3. వ్యర్ధ ప్రమాణము గాని, అబద్ద ప్రమాణముగానీ, చేసితివా?
4. ఆదివారము రోజున పూజలో పాల్గొంటివా ?
5. తల్లిదండ్రులు, గురువులు, ఉపాధ్యాయులు, పెద్దలు మొదలయినవారి మాట వింటివా? వారాలకు తగిన మర్యాద చేసితివా?
6. ఏవరిమీదనయినా విరోధము, కోపము, ధూషించుట, కొట్టుట జరిపితివా?
7. మాటలవల్లనేమి, తలంపువల్లనేమి, ఆశావాళ్లనేమి మోహ తప్పులు చేసితివా ? ఎన్ని సార్లు ?
8. దొంగపని చేసితివా, ఎంత? ఎవరి సొమ్మునైన నష్టపరచితివా? దొంగలకు సహాయము చేసితివా?
9. అబద్ధము చెప్పితివా? (ఉత్తమ మనస్తాప జపము చెప్పుట )

Holydivine