Prayers

జపమాల

మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వరా! దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను పాత్రుడను గాక యుండినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను, దేవమాతకు స్త్రోత్రము గాను ఏబది మూడు పూసల జపము చేయుటకు మహా ఆశగా నున్నాను. ఈ జపము భక్తి తో చేసి పరాకు లేక ముగింప మీ సహయము నియ్యనవధరించండి.

సకల పుణ్యమూలకు విశ్వాసమనేడి పుణ్యము ఆస్థి భారమై యుండుట వలన ముందు ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకొనుదుము గాక.

(1- పరలోక, 3- మంగళవార్త, 1-త్రిత్వ )

1. సంతోష దేవ రహస్యములు
(సోమ, శనివారములందు చెప్పవలెను)

1) గాబ్రియేలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుటను గురుంచి ధ్యానించుదము గాక
2) దేవమాత పునీత ఎలిజబేతమ్మను సందర్శించుటను గురుంచి ధ్యానించుదము గాక
3) జేసువు పుట్టుకను గురుంచి ధ్యానించుదము గాక
4) బాల జేసువు దేవాలయములో కానుకగా ఒప్పగింపబడుటను గురుంచి ధ్యానించుదము గాక
5) దేవమాత కానకబోయిన బాలజేసును దేవాలయములో కనుగొనుటను గురుంచి ధ్యానించుదము గాక

దుఃఖః దేవ రహస్యములు
(మంగళ, శుక్రవారములందు చెప్పవలెను)

1) జేసు రక్తచెమటను చెమర్చుటను గురుంచి ధ్యానించుదము గాక
2) జేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురుంచి ధ్యానించుదము గాక
3) జేసునాథుని తిరుశిరస్సున ముండ్ల కిరీటము పెట్టి కొట్టుటను గురుంచి ధ్యానించుదము గాక
4) జేసు స్లీవను మోసుకొని పోవుటను గురుంచి ధ్యానించుదము గాక
5) జేసు స్లీవమీద కొట్టబడి మరణము పొందుటను గురుంచి ధ్యానించుదము గాక

మహిమ దేవ రహస్యములు
(బుధ, ఆదివారములందు చెప్పవలెను)


1) జేసు ఉత్తాన మగుటను గురుంచి ధ్యానించుదము గాక
2) జేసు మొక్షారోహణమగుటను గురుంచి ధ్యానించుదము గాక
3) పవిత్రాత్మయైన సర్వేశ్వరుడు అపోస్తులులప మీద వేంచేసి వచ్చుటను గురుంచి ధ్యానించుదము గాక
4) దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుటను గురుంచి ధ్యానించుదము గాక
5) దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడుటను గురుంచి ధ్యానించుదము గాక


వెలుగు దేవ రహస్యములు
(గురువారములందు చెప్పవలెను)

1) యోర్దాను నదిలో యేసు బాప్తిస్మము పొందుటను గురుంచి ధ్యానించుదము గాక
2) కానా పల్లెలో మొదలైన యేసుని మహిమలు గురుంచి ధ్యానించుదము గాక
3) ప్రభువు దైవ రాజ్యమును ప్రకటించుటను గురుంచి ధ్యానించుదము గాక
4) ప్రభువు దివ్యరూపమును పొందుటను గురుంచి ధ్యానించుదము గాక
5) ప్రభు దివ్యసత్ప్రసాదమును ష్ఠాపించుటను గురుంచి ధ్యానించుదము గాక

ప్రతి దేవరహస్యము పిమ్మట ఈ దిగువ విన్నపమును చెప్పవలెను

ఓ మా యేసువా ! మా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగ నరక ఆపాయ స్థితిలో ఉన్న ఆత్మలను, మోక్షమునకు చేర్చండి.


అతిదుతయగు పునీత మిఖయేలా ! దేవదూతయగు పునీత గాబ్రియేలా ! అపొస్తలులైన పునీత రాయప్ప, ఆర్లప్పా, యాగప్ప అనెడు వారలారా, మే మెంత పాపాత్ములముగ నుండినను, మేము వేడుకొను ఈ ఏబది మూడు పూసల జపమును దేవమాత పాదములందు మీ ష్తోత్రములతో నొకటిగా జేర్చి కానుకగా సమర్పించుడని మిమ్ము జూచి ప్రార్థించుచున్నాము. ఆమెన్

కృపా రసముగల మాతా


కృపారసముగల మాతయైయు౦డెడి రాజ్ఞీ! వందనము
మా జీవమా! మా మధురమా! మా శరణమా! వందనము
పరదేశులమై యుండెడు మేము ఏవకు చెందిన బిడ్డలము
మిమ్ము చూచి మొరపెట్టుచున్నాము
ఈ కన్నీటి కనుమయందు ప్రలాపి౦చి ఏడ్చేడు మేము
మిమ్ము చూచి నిట్టూర్పు విడుచుచున్నాము
అందువలన మా కొరకు మనవి చేసెడు తల్లీ!
మీ దయారసముగల కన్నులను మా మీదకు త్రిప్ప నవదరించండి.
ఇదిగాక, ఈ పరదేశము గడచిన తరువాత
ఆశీర్వదింపబడిన మీ గర్భఫలమగు యేసునాధుని ప్రత్యక్షమైన
దర్శనమును మాకివ్వ నవదరి౦చ౦డి.
కృపగల తల్లీ! దయారసముగల తల్లీ!
ఓ మధురమైన కన్యమరియమ్మా! మా కొరకు ప్రార్ధించండి. ఆమెన్


దేవమాత ప్రార్థన

స్వామి కృపగా నుండండి
క్రీస్తువా! కృపగా నుండండి
స్వామి కృపగా నుండండి

క్రీస్తువా! మా ప్రార్థన విననవధరించండి
క్రీస్తువా! మా ప్రార్థన ప్రకారము దయచేయండి

పరలోకమందుడెడు పితయైన సర్వేశ్వరా , మా మీద దయగా నుండండి స్వామి

లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వరా
పవిత్రాత్మయైన సర్వేశ్వరా
మహా పరిశుద్ధ ఏక త్రిత్వ సర్వేశ్వరా


పరిశుద్ధ మరియమ్మ,.............................................. మాకొరకు వేడుకొనండి
సర్వేశ్వరుని యొక్క మాతా,
కన్యకల యొక్క పరిశుద్ధ కన్యకా,
క్రీస్తుని యొక్క మాతా,
దేవ వరప్రసాదము యొక్క మాతా,
మహా పరిశుద్ధ మాతా,
మహా విరక్తిగా నుండెడు మాతా,
నిర్మలమైన మాతా,
కన్యశుద్దము చెడని మాతా,
ప్రేమకు తగిన మాతా,
మహాస్తుతికి పాత్రమైన మాతా,
మంచి ఆలోచన యొక్క మాతా,
సృష్టికర్త యొక్క మాతా,
రక్షకుని మాతా,
మహా వివేకము గల కన్యకా,
మహాపూజ్యమైన కన్యకా,
స్తుతింపబడ యోగ్యమైన కన్యకా,
శక్తి గల కన్యకా,
దయ గల కన్యకా,
విశ్వాసము గల కన్యకా,
ధర్మము యొక్క అద్ధమా,
జ్ఞానము యొక్క ఆలయమా,
మా సంతోషము యొక్క కారణమా,
జ్ఞాన పాత్రమా,
మహిమకు తగిన పాత్రమా,
అత్యంత భక్తి యొక్క పాత్రమా,
దేవ రహస్యము గల రోజా పుష్పమా,
దావీదునియొక్క ఉప్పరిగా,,
దంతమయమైన ఉప్పరిగా,
స్వర్ణమయమైన ఆలయమా,
వాగ్దత్తము యొక్క పెట్టే,
మోక్షము యొక్క వాకిలీ,
ఉదయకాల నక్షత్రమా,
వ్యాథి గ్రస్తులకు ఆరోగ్యమా,
పాపాత్ములకు శరణమా,
కష్టపడెడు వారలకు అదరువా,
క్రీస్తువలయొక్క సహాయమా,
సన్మనస్కుల యొక్క రాజ్ఞీ,
పితాపితృల యొక్క రాజ్ఞీ,
దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞీ,
అపోస్తులుల యొక్క రాజ్ఞీ,
వేదసాక్షుల యొక్క రాజ్ఞీ,
స్తుతియుల యొక్క రాజ్ఞీ,
కన్యస్త్రీల యొక్క రాజ్ఞీ,
సకల పునీతుల యొక్క రాజ్ఞీ,
జన్మపాపము లేక ఉద్భవించిన రాజ్ఞీ,
మోక్షమునకు కోనిపోబడిన రాజ్ఞీ,
పరిశుద్ధ జపమాల రాజ్ఞీ,
కుటుంబము యొక్క రాజ్ఞీ,
సమాధానము యొక్క రాజ్ఞీ,

లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొఱ్ఱెపిల్లయైన జేసువా!
మా పాపములను మన్నించండి స్వామి!

లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొఱ్ఱెపిల్లయైన జేసువా!
మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి!

లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొఱ్ఱెపిల్లయైన జేసువా!
మా మీద దయగా నుండండి స్వామి!

యేసు క్రీస్తు దివ్య వాగ్దాత్తములకు మేము ప్రాప్తులమగునట్లు!
సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాతా! మా కొరకు ప్రార్ధించండి
.

ప్రార్దించుదము

జగద్రక్షకుడైన జేసువా ! మీ స్లీవ క్రింద నిలిచియుండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి యనుగ్రహమును దయచేసి దేవరవార కాలప్రమాణమందు నిజమైన మనుష్యుడై జన్మించ తెలిసికొనినటువంటి మాత యొక్క బిడ్డలుగా నుండేడు భాగ్యము మాకెప్పటికిని ప్రాప్తింపచేయ నవధరించండి. స్వామి. ఆమెన్

పునీత బెర్నార్డ్ దేవమాతను జూచి వేడుకొనిన జపము

మిక్కిలి నెనరుగల తల్లీ,మీ శరణుగోరి పరిగెత్తి వచ్చి మీ యుపకార సహాయములను బ్రతిమాలి,మీ వేడుకోలు సహాయమును అడిగినవారలయందు ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్టు ఎన్నడును లోకములో వినినది లేదని తలంప నవధరించండి. కన్యకల రాజ్ఞీయైన కన్యకా! కరుణారసముగల తల్లీ! ఇటువంటి నమ్మికచేత ప్రేరేపింపబడి,మీ దివ్య పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చేచు పాపినైనా నేను మీ దయాళుత్వమునకు కాచుకొని, మీ సముఖములో నిలుచుచున్నాను. అవతరించిన వార్తయొక్క తల్లీ! నా విజ్ఞాపనమును త్యజింపక దయపరివై నిన్న విన నవధరించండి.

జన్మపాపము లేక ఉద్భవించిన పవిత్ర మరియమ్మా! పాపులకు శరణమా! ఇదిగో పరుగెత్తివచ్చి, మీ శరణుజొచ్చితిమి.
మా మీద నెనరుగా నుండి. మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. (ఇట్లు మూడు సార్లు చెప్పి 1పర. 1మం. త్రీత్వ. )

దేవమాతకు సమర్పణ

నా యొక్క రాజ్ఞీ నా యొక్క తల్లి! నన్ను మీకు సంపూర్ణముగా సమర్పించుచున్నాను. నా యొక్క భక్తి మీకు చూపించుటకు ఈ దినము నా కండ్లను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించుచున్నాను. కాబట్టి నన్ను మీ స్వంతముగా చేసికొని నన్ను కాపాడనవధరించండి. ఆమెన్

జేసు, మరియా, జోజప్పా! నా హృదయమును నా యాత్మను నా జీవితమును, మీకు సమర్పించుచున్నాను

జేసు, మరియా, జోజప్పా! నా కడపటి అవస్థలో నాకు సహాయము చేయండి

జేసు, మరియా, జోజప్పా! మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణము విడుచుదును గాక

Holydivine